YouTube ద్వారా ఆదాయం పొందడం ఎలా?

Share
  • Document
  • 630 KB
24
Description

గతంలోలా youtube అంటే కేవలం మన ఇంట్లోని సరదా సంఘటనల, పెంపుడు జంతువుల వీడియోలను upload చేయడానికే పరిమితం కావడం లేదు. పెద్ద పెద్ద కంపెనీలు కూడా తమ వ్యాపారాన్ని సామాన్యుడికి చేరువ చేసేందుకు youtubeను ఓ మంచి వేదికగా ఉపయోగించుకుంటున్నాయి. ఇంతకుముందు వినోదం, విద్య, టెక్నాలజీ లాంటి అనేక రంగాలలో పెట్టుబడి పెట్టగలిగే స్తోమత ఉన్నవారికే ఆ రంగాలలో విజయం లభించేది. ఆసక్తి ఉండి కూడా పెట్టుబడి పెట్టగలిగే స్తాయిలేనివారు ఏదో తమకు ఇష్టంలేని ఏదో ఉద్యోగం చేసుకుంటూ వారి కలలను నెరవేర్చుకునే వీలులేక అసంతృప్తితోనే జీవితాన్ని గడిపేవారు. కానీ టెక్నాలజీ ఎప్పుడైతే సామాన్యునికి సైతం చేరువయ్యిందో అప్పుడే ఆర్ధికపరమైన అసామానతలు నెమ్మదిగా తొలిగిపోతూ youtube, Google, Android లాంటి అనేక మాధ్యమాల ద్వారా ఓ common man కూడా తనలోని టాలెంట్ ను ప్రపంచానికి చాటే అద్బుత అవకాశం లభించింది.
మీరు అలాంటి టాలెంట్ ని కలిగి ఉంటే ఈ చిన్ని పుస్తకం మీకోసమే.